విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రాయోజిత పథకం FPO రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ,పురోగతిపై 8 వ ఎస్ ఎల్ సి సి స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు మంగళగిరి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ , ఐ.ఎ.ఎస్., వారి అధ్యక్షతన రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ S .డిల్లీ రావు ఐ.ఎ.ఎస్, వారు నిర్వహించారు. ఈ సమావేశము నకు కన్వీనర్ గా నాబార్డు వారు వ్యవహరించారు .హైబ్రిడ్ విధానములో జరిగిన ఈ సమావేశంలో శ్రీ డోలా శంకర్ IoFS, మత్స్య శాఖ కమిషనర్ ,FPO రాష్ట్ర స్థాయి విభాగపు అధికారులు అయిన ఎన్ సి డి సి, ఎస్ ఎఫ్ ఏ సి, నాఫెడ్ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విశ్వవిద్యాలయం, పశు సంవర్థక శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ పాల్గొన్నారు.
రాష్ట్రానికి కేటాయించిన 450 FPO లకు గాను,అమలుచేసే వ్యవస్థల ప్రకారం
నాబార్డ్ (NABARD) – 135
నాఫెడ్ (NAFED) – 49
ఎన్ సి డి సి (NCDC) – 52
ఎస్ ఎఫ్ ఏ సి (SFAC) -214 లలో ఎరువుల, పురుగు మందుల వ్యాపారము కొరకు లైసెన్సు పొందడంలో జరుగుతున్న జాప్యాన్ని వాకబు చేశారు. వాటిపై స్పందిస్తూ సరియైన గోడౌన్స్ లభ్యతలో లేకపోవడం, GST విధానం, FPO లలోని సభ్యులలో ఆసక్తి లేకపోవడం తదితర విషయాలను తెలిపారు.
FPO లో అమలు,వారు ఎదుర్కుంటున్న సమస్యలపై అన్నింటినీ ఒకే గాడిన కాకుండా జిల్లాల వారీగా,సమస్యల ప్రాతిపదికన నివేదికలు ఇవ్వాలని తెలియచేసారు.
ఈ హైబ్రిడ్ విధానపు సమావేశములో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
• సీఈఓ,SERP G.వీరపాండ్యాన్ ఐఏఎస్
• మార్క్ ఫెడ్ MD Dr.మనజీర్ జీలాని సమీన్ ఐఏఎస్ ,
• హార్టికల్చర్ కమిషనర్ కె.శ్రీనివాసులు ఐఏఎస్
• SLBC కన్వీనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు .
రాష్ట్రములో పాతబడిన ప్రభుత్వ భవనములను FPO లకు వారి కార్యక్రమములు నిర్వహించటానికి కేటాయించాలని కోరారు.
కార్యక్రమ కన్వీనర్ మహేష్ ప్రసాద్,నాబార్డ్ జనరల్ మేనేజర్ వందన సమర్పణ చేశారు .
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …