-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లతో మంగళవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్ లకు గాను 11 నోడల్ ఆఫీసర్లను నియమించగా, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు 11 వార్డ్ వెల్ఫేర్ / ఏమినిటీస్ సెక్రెటరీలను, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరో 11 వార్డ్ వెల్ఫేర్ / ఏమినిటీస్ సెక్రటరీలను అన్న క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణకు గాను నియమించగా, వారితో టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నోడల్ ఆఫీసర్లు చూసుకోవాలని, ప్రతిరోజు మూడు పూట్ల ఇచ్చే టోకెన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, కిచెన్ లో పరిశుభ్రత, భోజనంలో నాణ్యత, త్రాగునీటి సరఫరా, వాడుక నీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.