తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చొరవతో ఇరకం విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడ మండలం ఇరకం దీవి నుంచి నిత్యం విద్యార్థులు మర పడవల ద్వారా బీవీపాలెం పాఠశాలకు 40 మంది తెలుగు విద్యార్థులు, అలాగే సున్నాంబుకులం పాఠశాలకు 100 మంది తమిళ విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. గమ్యం చేరడానికి సుమారు గంటపాటు ప్రయాణం చేయాల్సి వుంటుంది. అయితే విద్యార్థులు ప్రయాణించే బోట్లు పాతబడ్డాయి. దీంతో ఆ ఇంజన్లు ప్రయాణం మధ్యలో మొరాయిస్తుండడంతో విద్యార్థులతో పాటు వాళ్ల తల్లిదండ్రల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి, సమస్యను తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందించి, రెండు బోట్లకు కొత్త ఇంజన్లు కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. మరబోట్లకు కొత్త ఇంజన్లు అమర్చడంతో విద్యార్థులు ధైర్యంగా ప్రయాణిస్తున్నారు. సమస్యపై వెంటనే స్పందించిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి , కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్పారు.
Tags tirupathi
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …