విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాం అని,గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమ అభివృద్ధి కె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 8 వ డివిజిన్ లో పర్యటించిన ఆయన ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లలిత జేవెలరీ పక్కన గల శ్యామ్ ప్రసాద్ వీధికి మంజూరు అయిన 15 లక్షల రూపాయల సీ సీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వహయాంలో ఏదైనా నియోజకవర్గంలో గాని,డివిజిన్లో గాని ఆ పార్టీ వారు ఓడిపోతే ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసేవారు కాదని,చిన్నచూపు చూసేవరని, కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మనం ఓడిపోయిన సరే అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి చేసే బాధ్యత మనదే అని అన్ని ప్రాంతాల అభివృద్ధి కి నిధులు మంజూరు చేస్తున్నారని,అందుకు నిదర్శనమే మన తూర్పు నియోజకవర్గం అని కొనియాడారు. ఇక్కడ వైస్సార్సీపీ ఓడిపోయిన సరే అడిగిన ప్రతి పనికి కాదు అనకుండా నిధులు మంజూరు చేస్తు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత నిస్తున్నారని ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆయన స్పూర్తితో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో 8 వ డివిజన్ లో కొత్తపల్లి రజనీ ఓటమి చెందిన సరే కృంగిపోకుండా నిత్యం ప్రజలలో ఉంటూ వారి ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరానికి కృషి చేస్తున్నారు అని,కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని వదిలి అనేక సామాజిక సేవ కార్యక్రమలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారని అభినందించారు. రాబోయే రోజుల్లో ఓడిపోయిన డివిజన్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగుంటమని తెలిపారు. కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు వారి రాజకీయ మనుగడ కోసం లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలలో భయం రేకెత్తిస్తోన్నారని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని హుందాగా ప్రవర్తించాలి అని హితవు పలికారు, లేకపోతే మహిళలే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జ్ కోటపల్లి రజిని, రవి, నాంచారయ్య, ధనశేఖర్, సంసోన్, చిన్నా, వాణి, స్వాతి, మహేష్, వంశి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …