అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎం లను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.
Read More »Tag Archives: AMARAVARTHI
ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయమేమీ లేదు
-నెట్వక్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి -డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ జి.లక్షీశా వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ లబ్దిదారుల సేవలకు అంతరాయం కలిగించకుండా సహకరించాలనే పిలుపునకు అన్ని నెట్వక్క్ ఆసుపత్రుల యాజమాన్యాలూ సానుకూలంగానే స్పందిస్తున్నాయని డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ జి.లక్షీశా నేడొక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి గత ఆర్థక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,566.22 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేశామన్నారు. …
Read More »ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి
-తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన -మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై శిక్షణా వీడియోలు -వీడియోలో రుచికర, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల వివరణ -రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, రుచిని నిర్ధారించడమే లక్ష్యం -100 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేటట్లు ప్రోత్సహించాల్సిందిగా డీఈవోలకు ఆదేశం -కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయన్న నమ్మకం -“తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన”లో …
Read More »కౌంటింగ్ ప్రారంభమానికి ముందు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ఫలితాలు వెల్లడించే సమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!! 1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి. ఈ ఫారం 17సీ ఏజెంట్లు సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లు భావించాలి. 2) ప్రతి పోలింగ్ కేంద్రం (Polling Station) ఫారం 17సీ లో వున్న కంట్రోల్ యూనిట్ (C.U No) నెంబరు, మిషన్ పైన వున్న …
Read More »చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలి… : గజ్జల వెంకటలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో తరగతి గదిలో విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మైనర్ బాలికకు మెరుగైన వైద్యం, షెల్టర్ హోమ్ ద్వారా రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు సూచనచేసారు. అండగా ఉంటామని బాధితురాలి తల్లికి గజ్జల వెంకటలక్ష్మి …
Read More »ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More »ఏపీలో మరొక్క ఐదు నూతనంగా మెడికల్ కాలేజీలు !
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) త్వరలో ఐదు చోట్ల అతి త్వరలో ఇన్‌స్పెక్షన్ …
Read More »మే 23 బుద్ధ పూర్ణిమ… బుద్ధుడు చెప్పింది విందాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 23 బుద్ధ పూర్ణిమ… భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ కు బుద్ధుడు బోధనలు స్ఫూర్తిగా నిలిచాయి. అహింస ద్వారానే ఏదైనా సాధించగలమని బుద్ధుడు పలుమార్లు చెప్పారు. గౌతమ బుద్ధుడు 29 సంవత్సరాల వయస్సులో సన్యాసం తీసుకున్నారు 6 సంవత్సరాల పాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆచరించిన సత్యం, అహింస, ధర్మం, దయ కోసం ప్రజలను ప్రేరేపించారు. ఆ మార్గాన్ని అనుసరించడానికి బౌద్ధమతాన్ని స్థాపించారు. బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని …
Read More »విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో బుధవారం విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు ఎంత వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటలకు అభిషేకం మహోత్సవం, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవం, అష్టోత్తర శతనామార్చన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి తో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.
Read More »పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్ధులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్ లు అందించాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు,బ్యాగులు వంటివన్నీవిద్యార్ధులకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.2024-25 విద్యా సంవత్సర సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ తీసుకుంటున్న సన్నాహక చర్యలను సమీక్షిస్తూ విద్యార్ధులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు,బ్యాగులు,బూట్లు …
Read More »