Breaking News

Tag Archives: amaravathi

ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం,ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ప్రకృతి వ్యవసాయ విదానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిదులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్ళకు సమాధానంగా రాష్ట్రం …

Read More »

స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను …

Read More »

డోలి మోత గ్రామాల రహదారులకు ప్రాధాన్యత

పాచిపెంట (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి, డోలి మోతలు నివారణకు …

Read More »

పారిశ్రామిక వేత్తలుగా మహిళలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సొంతూర్లోనే ఆదాయం ఆర్జించేలా యువతకు ప్రోత్సాహం -ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం -నేడు(శనివారం) సామాజిక పెన్షన్ల పంపిణీ -మోడల్ పంచాయతీగా రాంపురం అభివృద్ధి : మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : సొంతూరులో ఉండి యువత ఆదాయం ఆర్జించేలా ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని …

Read More »

రాయచోటిలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయచోటి, అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటి, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు గురుగింజ బాలాజీ, శివ ప్రసాద్ రాజ్, ఎ. శేఖరయ్య నాయుడు, ఎస్. చలపతి, ఆర్ త్రివిక్రమ్ రాజు, ఆదినారాయణ రెడ్డి, …

Read More »

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ మంత్రి డోలా.బాలవీరాంజనేయ స్వామి కి ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.పురుషోత్తమనాయుడు, ఎ.విద్యాసాగర్ మరియు రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా.బాల.వీరాంజనేయ స్వామిని కలిసిన ఎ.పి.యన్.జి.జిఓ ల అగ్ర నేతలు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో అరగంటపాటు చర్చించారు. అనంతరం 22 అంశాలతో కూడిన వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కారం చేయాలని,ముఖ్యమంత్రితో జరగనున్న సమీక్ష …

Read More »

హాస్ట‌ల్ విద్యార్థుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట బీసీ హాస్ట‌ల్ విద్యార్థుల స‌మ‌స్య‌ను తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప‌రిష్క‌రించారు. గ‌తంలో బీసీ హాస్ట‌ల్ విద్యార్థులు తిరుప‌తి ఎంపీ కార్యాల‌యానికి వెళ్లారు. ర‌క్షిత మంచి నీటి స‌దుపాయం లేద‌ని, క‌లుషిత నీళ్లు తాగి రోగాల బారిన ప‌డుతున్న‌ట్టు ఎంపీ ఎదుట విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే నాయుడుపేట బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల‌ హాస్ట‌ల్‌లో క‌లుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన సంద‌ర్భంలో, ఎంపీ వారిని ప‌రామ‌ర్శించారు. ఆ సంద‌ర్భంలో సుర‌క్షిత …

Read More »

ప్రత్యేక కార్పొరేషన్తోనే మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం… : మోటూరు శంకరరావు

ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా మాజీ సైనికుల సమస్యలు పరిష్కారమౌతాయని మాజీ సైనికోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు తెలిపారు. గురువారం పొద్దుటూరు జరిగిన స్టేట్ అసోసియేషన్ సభ్యత్వం కారక్రమానికి విచ్చేసిన ఆయన మాజీ సైనికోద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో మాట్లాడుతూ ఇన్నే ళ్లుగా ఎన్ని ప్రభుత్వాలకు మాజీ సైనికోద్యోగుల సమస్యలు చెప్పి నా పట్టించుకోలేదన్నారు. నారాలోకేష్ పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చామన్నారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ మేరకు మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక …

Read More »

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్శన్,సభ్యుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం

-ధరఖాస్తులు పంపేందుకు చివరి తేది డిశంబరు 11 -తే. 15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి -రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్ పర్శన్ మరియు ఒక సభ్యుడు(జుడీషియల్)మరో సభ్యుడు(నాన్ జుడీషియల్)నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ …

Read More »

మహాత్మా జ్యోతి బా పూలే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి : సిఎస్ నీరబ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన,స్ర్తీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతి బా పూలే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు,అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో …

Read More »