Breaking News

ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం,ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ప్రకృతి వ్యవసాయ విదానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిదులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్ళకు సమాధానంగా రాష్ట్రం లో ప్రకృతి వ్యవసాయం అమలు చేయడం ప్రశంసనీయమని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రశంసించింది.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా చూడలేదని, అనేక సవాళ్లను అధిగమించేలా ఈ సూత్రాలు ఉన్నాయని, ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని అంతర్జాతీయ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని, చిన్న స్థాయి రైతుల కోసం ఇది గొప్ప అనుభవ మార్పిడి సమావేశమని పేర్కొన్నారు. పనామా, బ్రెజిల్, గాంబియా, దక్షిణ కొరియా,ఇండోనేషియా, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి ఆగ్రో ఎకాలజీ నిపుణులు, పరిశోధకులు, రైతు నాయకులు, వ్యవసాయ నిపుణులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ఈ బృందం శుక్రవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభమై రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు ప్రకృతి వ్యవసాయ చక్రం ప్రదర్శించి ప్రకృతి వ్యవసాయం వెనుక దాగి ఉన్న తొమ్మిది సూత్రాలను వివరించారు. అనంతరం మూడు బృందాలు గా విడిపోయిన అంతర్జాతీయ ప్రతినిధులు కుప్పం మండలం లోని సీగలపల్లి, అంకిరెడ్డిపల్లి, సింగా సముద్రం, జీడిమాకులపల్లి గ్రామాలలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.

క్షేత్ర పర్యటనల్లో భాగంగా రైతు సాధికార సంస్థ అధికారులు బీజామృతం, ఘన జీవా మృతం, ద్రవజీవామృతం, విత్తన గుళికల తయారీని డెమో పద్ధతిలో ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించి ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, వనరుల వినియోగం గురించి అర్థం చేసుకోవడంతో పాటు రసాయనిక వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించి రెండింటికీ మధ్య గల తేడాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు జి. కృష్ణ మూర్తి, కె.ఎం. వెంకటరమణ, జి.వి. సత్యనారాయణ, ఎం. మురుగేష్, ఆర్. హనుమంత కుమార్ అనుసరిస్తున్న “A” గ్రేడ్ మోడల్స్, రైతులకు ఏడాది పొడవునా ఆదాయం కల్పించే నమూనా, షేడ్‌నెట్ కూరగాయలు,సూర్యమండలం, యూనివర్సల్ మోడల్ కాంపాక్ట్ బ్లాక్ మోడల్ లను బృంద సభ్యులు సందర్శించారు. ఈ పర్యటన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పట్ల చూపుతున్న విశిష్టతను ప్రపంచానికి తెలియజేయడం లో ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగంలో స్థిరమైన విధానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ సూత్రాలు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ అమలులో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం లో మరియు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించడంలో ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముని రత్నం, ఏపీసీఎన్ఎఫ్ రీజనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ చక్రాల చంద్రశేఖర్ మునిరత్నం,జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, జిల్లా మేనేజర్ వాసు, రైతు సాధికార సంస్థ అధికారులు రాము, భాగ్యలక్ష్మి, సురేష్ , జిల్లా స్థాయి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *