-ప్రమాదంపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం -బాధితుల పరామర్శకు రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక …
Read More »Tag Archives: amaravathi
థర్డుపార్టీ ఏజన్సీల వల్లే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి
-అనకాపల్లి సెజ్ లో జరిగిన అగ్నిప్రమాద బాదితులకు తక్షణ సహాయ చర్యలు అందజేస్తున్నాం -రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డు పార్టీ ఏజన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రణా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో …
Read More »అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టి.జి భరత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్రమాద ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని టి.జి భరత్ కోరారు. పరిశ్రమల శాఖ అధికారులు అక్కడే …
Read More »రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు
-పోలీసు శాఖను పటిష్ట పర్చేందుకు సిఎం సమీక్షలో పలు నిర్ణయాలు -రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం …
Read More »ఈనెల 23న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించండి
-ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారిని నియమించాలి -ఉపాధిహామీ పనులపై అవగాహన తోపాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలపై చర్చించాలి -సెప్టెంబరు 11 నుండి నూతన ఇసుక విధానం అమలు ప్రారంభం -ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి -ఇసుక రీచ్ ల వారీగా ఇసుక తవ్వకం,రవాణా చార్జీల ధరలను నిర్ధారించండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈనెల 23న ఒకేరోజు నిర్వహించే గ్రామ సభలను విజయవతంగా నిర్వహించాలని ప్రతి గ్రామ సభకు …
Read More »వరద నీటిలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం రికార్డు
-ఫలితంగా తుంగభద్ర రిజర్వాయరులో 40 టి.ఎం.సి.ల వరద నీటిని కాపాడుకోగలిగాం -రాష్ట్ర రైతాంగం ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి కృతజ్ఞతలు -రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా తుంగభద్ర 19 వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం అనేది భారత దేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టమని, అటు వంటి రికార్డును సృష్టించిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య …
Read More »కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, …
Read More »ఎంఎల్సిగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించిన కౌన్సిల్ చైర్మన్ కె.మోషేన్ రాజు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు వారి చాంబరులో బొత్సతో ఎంఎల్సిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు పాల్గొన్నారు.
Read More »కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్
-వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం -ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి -సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి -రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడపలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని వివరించాలని మంత్రి కోరగా… స్పందించిన …
Read More »రీ సర్వేలో రికార్డులు తారుమారయ్యాయి
-బ్యాంకు రుణం ఉన్న రికార్డులు ఎలా మారుతాయి? -రీ సర్వే అక్రమాలపై జనసేన జనవాణికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు -మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తాతల కాలం నుంచి ఉన్న భూమిలో ఉన్న పళంగా సగం మాయం అయ్యింది. రికార్డులు తారుమారయ్యాయి. సర్వే చేయమంటే అధికారులు సగం భూమికే సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో నా భూమి పోయింది. పూర్వపు రికార్డుల ప్రకారం …
Read More »