Breaking News

Tag Archives: hyderabad

తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ విజేత/పార్టీ

-కాంగ్రెస్-64, BRS-39, BJP-08, MIM-07, CPI-01 హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : 1 సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ 2 చెన్నూరు గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ 3 బెల్లంపల్లి గడ్డం వినోద్ కాంగ్రెస్ 4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 5 ఆసిఫాబాద్ కోవా లక్ష్మీ బీఆర్ఎస్ 6 ఖానాపూర్ వెడ్మ భొజ్జు కాంగ్రెస్ 7 ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ 8 బోథ్ అనిల్ జాదవ్ బీఆర్ఎస్ 9 నిర్మల్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ 10 …

Read More »

బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుఫాను నిర్వహణ సంసిద్ధతపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుపాను నేపథ్యంలో విపత్తు నిర్వహణపై రాష్ట్ర/కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రిమండలి కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా తుపాను ప్రస్తుత స్థితి గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండి) డైరెక్టర్ జనరల్ కమిటీకి వివరించారు. ఆగ్నేయ-సమీప నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గడచిన 6 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది. అనంతరం ఇప్పుడు …

Read More »

విజ‌య‌వంతంగా 5వేల‌కుపైగా వెరికోజ్ వెయిన్స్ చికిత్స‌లు

-తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌ప్ర‌ధ‌మం -అత్యాధునిక హైబ్రేడ్ క్యాత‌ల్యాబ్ ప్రారంభం -ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఇండియ‌న్ యాక్ట‌ర్స్ కుమారి అనీషా ముఖ‌ర్జి -వేడుక‌గా చిరంజీవి హాస్ప‌ట‌ల్ తొలి వార్షికోత్స‌వం హైద‌రాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త సంవ‌త్స‌రం క్రితం కూక‌ట్‌ప‌ల్లిలో వెరికోజ్ వెయిన్స్‌కు ప్ర‌త్యేక చికిత్సా కేంద్రంగా రూపొందించిన చిరంజీవి హాస్ప‌ట‌ల్ నేడు తొలి వ‌సంతోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ట్లు ప్ర‌ఖ్యాత వ్యాస్క్‌ల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కె.సంజీవ‌రావు, డెర్మ‌టాల‌జిస్టు డాక్ట‌ర్ పి.శిల్ప నేడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్‌బోర్డ్ కాల‌నీలోని హోట‌ల్ వైష్ణ‌వి గ్రాండ్‌లో జ‌రిగిన విలేక‌రుల …

Read More »

ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం

-ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నవంబరు 2 వరకు చేనేత ప్రదర్శన హైదరాబాద్ ,నేటి పత్రిక ప్రజావార్త : ఉత్పత్తి ధరలకే అందిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ, ఆప్కో సంయిక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం సునీత ప్రారంభించారు. నవంబరు రెండవ …

Read More »

బీసీవై ఎన్నికల శంఖారావం!

-తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ -నవంబర్ 1న పార్టీ మేనిఫెస్టో.. అభ్యర్ధుల ప్రకటన విడుదల హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్రయాదవ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 70 లో జర్నలిస్ట్ కాలనీ …

Read More »

ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సు

-ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు పోటీ (ఐఎస్ఏసి) 2022 విజేతలను సన్మానించనున్న రాష్ట్రపతి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో 2023 సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఇండియా స్మార్ట్ సిటీస్ 2023 సదస్సును కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇండోర్‌లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు జరుగుతుంది. సదస్సులో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 100 స్మార్ట్ సిటీలు పాల్గొంటాయి. వినూత్న ఆవిష్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న 100 …

Read More »

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ‘వీరుల’కు నివాళులు అర్పించేందుకు ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారం

-గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా జన భాగీధారి కార్యక్రమాలు నిర్వహణ -గ్రామ పంచాయతీల్లో శిలాఫలకాలు (స్మారక ఫలకాలు) ఏర్పాటు -అమృత వాటిక రూపకల్పన కోసం దేశంలోని మూలమూలల నుంచి మట్టిని దిల్లీకి తీసుకురావడానికి అమృత కలశ యాత్ర హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ఇటీవలి ‘మన్ కీ బాత్’లో, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులను, వారి ధైర్యసాహసాలను గౌరవించడం …

Read More »

ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం

-ఎఫ్టీపీసీ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ మెడికేర్ అచీవ్మెంట్ అవార్డు – 2023 ప్రదానం -యూ ఎస్ ఏ, యూ కే, ఇండియా లో ఫెలోషిప్స్ సాధించి మూడు దేశాలలో రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ పొందిన గణేష్ గొర్తి -డాక్టర్ గణేష్ కు అవార్డును అందజేసిన బాలీవుడ్ నటి దేబలినా దత్తా హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కాంటినెంటల్ హాస్పిటల్ ద్వారా …

Read More »

తెలుగు భాషా పరిరక్షకులు డా.మండలి బుద్ధప్రసాద్ కి, కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం

-మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చే బహూకరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షకులు, మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ “కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని” అందుకున్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్..నృత్య కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో శక పురుషులు, పూర్వ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా.ఎన్.టి.రామారావు శత జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ కి కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని బహూకరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాలి రఘురామ్ …

Read More »