Breaking News

తెలంగాణ వరదల సహాయక చర్యల నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కోటి విరాళం

హైదారాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు. అనంతరం వారి భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద అందజేసినట్లు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అప్యాయంగా స్వాగతించారని, ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ మేరకు వారు భేటీ అయిన ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *