Breaking News

Tag Archives: hyderabad

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో …

Read More »

ప్ర‌జా భ‌వ‌న్‌లో బోనాల సంబురాలు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ‌ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహిసున్నారు. అయితే.. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుంచి.. అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ బయలుదేరి వెళ్లారు. కాటమయ్య రక్ష …

Read More »

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఈ రోజు సందర్శించారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలోని కీలక ఉత్పత్తి యూనిట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీనియర్‌ మేనేజర్లతో వివరణాత్మక చర్చలు జరిపారు, కర్మాగారం పనితీరును సమీక్షించారు. ఈ పరిశీలన అనంతరం కార్మికులతోనూ మంత్రి మాట్లాడారు. …

Read More »

తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది

-తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం -హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి -తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి -గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి -ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం -మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా -టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు -చంద్రబాబుకు ఘన స్వాగతం …

Read More »

వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-యువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి – ముప్పవరపు వెంకయ్యనాయుడు -వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య  – దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి -ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని -భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నుంచి తాను చాలా నేర్చుకున్నానని భారత ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ చెప్పారు. మంచి ఆలోచనలు, …

Read More »

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్‌, లేజర్‌ షో, పోలీస్‌ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ …

Read More »

చంద్రబాబు నాయుడును కలిసిన వసంత కృష్ణ ప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లోగురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపి వారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.

Read More »

మహేశ్ బాబు పుత్రోత్సాహం.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టా అందుకున్నాడు. దీనిపై మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. నీ కలల సాకారం కోసం కృషిచేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అని పోస్ట్ చేశారు.

Read More »

టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు తీపికబురు చెప్పింది. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థులందరూ వెరిఫికేషన్‌కు కావల్సిన సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ త్వరలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని ప్రెస్ నోట్‌లో తెలిపింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తామని పేర్కొంది. ఇక దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది. డాక్యుమెంట్ …

Read More »

భూమి పుత్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. శుక్రవారంనాడిక్కడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి టీ హరీశ్రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »