Breaking News

Tag Archives: machilipatnam

వినియోగదారుల నుండి స్పందన బాగుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తున్న టమాటాలు, వంట నూనెలకు వినియోగదారుల నుండి స్పందన బాగుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి అన్నారు. డీఎస్ఓ గురువారం స్థానిక రైతు బజార్ సందర్శించి టమాట, ఆయిల్ విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ నేటి నుండి రైతు బజార్లలో కిలో టమాట 50 రూపాయలు, లీటర్ పామాయిల్ 114 రూపాయలు, లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ …

Read More »

పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియం (తాత్కాలిక నిషేధం)తో కలిపి రెండు సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఈ విధంగా చేసుకుంటే రైతుల నుండి …

Read More »

పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరణ (రివైవల్) చేయాలి

-గ్రామపంచాయతీల్లో నూరు శాతం పన్నుల వసూళ్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీ రాజ్ వ్యవస్థను పునరుద్ధరణ ( రివైవల్) చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం PR ONE – Visible assets అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా …

Read More »

పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కౌంటర్లు 

మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్నధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ల ద్వారాతక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం విక్రయాలతో పాటు అదనముగా ఈరోజు నుంచి వంట నూనెలు అనగా సన్ ఫ్లవర్ నూనె మరియు పామొలిన్ నూనెలను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు అనగా సన్ ఫ్లవర్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 124/- చొప్పున,పామొలిన్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 114/- మరియు టొమాటో కేజీ ఒక్కింటికి రూ. 50/- …

Read More »

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించారని, నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో కాలువల పూడిక, …

Read More »

బైపాస్ రహదారి వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 4 వరుసల తూర్పు బైపాస్ రహదారి వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ ఐ)ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో చైతన్య ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మురళి నూతనంగా నిర్మించనున్న తూర్పు బైపాస్ రహదారి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా …

Read More »

మచిలీపట్నం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కలెక్టర్ ఆకస్మిక సందర్శన

-ఈనెల 11వ తేదీన మద్యం దుకాణాలకు నిబంధనల మేరకు పటిష్టవంతంగా పాటలు నిర్వహించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం స్థానిక మచిలీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగుస్తుందని, 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి మద్యం దుకాణాలకు పాటల నిర్వహణ ప్రారంభమవుతుందని, కాబట్టి ప్రతి దరఖాస్తుదారునికి పాటలు …

Read More »

“పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం క్రింద జిల్లాలో ఈనెల 14 నుండి 20 వరకు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. “పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం నిర్వహణపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఉపాధి హామీ …

Read More »

ప్రజలకు ఉచిత ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యం

-తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా -మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే లక్ష్యంతో జూలై 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చిందని, అక్టోబర్ 16 నుంచి పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిథుల గృహంలో …

Read More »

జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడి, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,పాఠశాల భవనాల నిర్మాణానికి జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులను (డి ఎం ఎఫ్) తొలి ప్రాధాన్యతగా వినియోగించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి జిల్లాలోని శాసనసభ్యులతో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం …

Read More »