Breaking News

మచిలీపట్నం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కలెక్టర్ ఆకస్మిక సందర్శన

-ఈనెల 11వ తేదీన మద్యం దుకాణాలకు నిబంధనల మేరకు పటిష్టవంతంగా పాటలు నిర్వహించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం స్థానిక మచిలీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగుస్తుందని, 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి మద్యం దుకాణాలకు పాటల నిర్వహణ ప్రారంభమవుతుందని, కాబట్టి ప్రతి దరఖాస్తుదారునికి పాటలు నిర్వహించే ప్రదేశం, సమయం వివరాలు వారి మొబైల్ కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. మద్యం దుకాణాలకు పాటల నిర్వహణ నిబంధనల మేరకు పటిష్టవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎక్సైజ్ అధికారులకు సూచించారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపర్నెంట్ జి గంగాధర్ రావు, సహాయ ఎక్సైజ్ సూపర్నెంట్ సి భార్గవ్ తదితరులు కలెక్టర్ వెంటే ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *