Breaking News

Tag Archives: rajamandri

కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో పలు అంశాలు ప్రస్తావించిన ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి హాజరైన రాష్ట్ర బిజెపి అధ్యక్షు రాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆనందం వ్యక్తంచేసారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉంది. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మహిళా సాధికారత కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్న …

Read More »

రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

-నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రైతు పండించిన పంటను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగా పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలి…

-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, డిఆర్ఓ టి. శ్రీరామ చంద్ర మూర్తి తో కలసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ఉపాథి హామీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేద వారీ సొంత ఇంటి సాకారం చేసే క్రమంలో స్టేజ్ కన్వర్షన్ తో పాటుగా, ఉపాథి హామీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం హౌసింగ్, ఉపాధి హామీ, పి జి ఆర్ ఎస్, ఖరీఫ్ ధాన్యం సేకరణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి. శ్రీరామ చంద్ర మూర్తి …

Read More »

ఉండ్రాజవరం మండలం తాడిపర్రు లో విషాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇష్టానుసారంగా , ప్రమాదకర స్థాయిలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చెయ్యవద్దనీ, కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో కలెక్టరు, ఆర్డీఓ , పోలీసు అధికారులు, ఇతర అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి గ్రామస్థులతో ముఖా ముఖి సంభాషించి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘటన నేపథ్యంలో తీవ్ర …

Read More »

కడియంలో జరిగిన అత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ -అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించిన మంత్రి దుర్గేష్ -త్వరితగతిన కేసును పరిష్కరించిన పోలీసులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ -గంజాయి మత్తులో యువత నిర్వీర్యం అయిపోతుందని, గంజాయి పై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం (కడియం), నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రీ రూరల్ కడియంలోని ఓ నర్సరీలో పనిచేస్తున్న వివాహిత …

Read More »

తాడిపర్రు ఘటనపై ఎంపీ పురందేశ్వరి దిగ్బ్రాంతి

-ఆస్ట్రేలియా నుంచి ఫోన్ ద్వారా సోమవారం ఉదయం సందేశం పంపిన ఎంపీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజక వర్గం ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ప్లెక్సీ కడుతూ బొల్ల వీర్రాజు(27), కాసగాని కృష్ణ(27), మారిశెట్టి మణికంఠ(29), పామర్తి నాగరాజు(26) కరెంట్ షాక్ తో మృతి చెందడం …

Read More »

జిల్లాలోని పంచాయతీల్లో టిబి టెస్టులు తప్పనిసరిగ్గా చేయాలి

-జనాభా ప్రాతిపదికన ప్రతి లక్షకు మూడు వేల టిబి టెస్టులు చేయించాలి -2022 లో టీబీ ముక్త్ పం చాయతీలకు బ్రాన్జ్ మెడల్ కు ఎన్నికైన 109 పంచాయతీలు ఎంపిక. -2023 లో సిల్వర్ మెడల్ సంపాదించుకున్న 89 పంచాయతీలు -2024 తో ముగియనున్న సంవత్సరానికి గోల్డ్ మెడల్ కోసం ఇప్పటి వరకూ పోటీలో ఉన్న 39 పంచాయతి లు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని పంచాయతీల్లో టిబి ప్రిసమ్పటివ్ టెస్టులు తప్పని సరిగ్గా …

Read More »

రోడ్డు మధ్యలో గుంతలు పూడ్చటం, కల్వర్టుల నిర్మాణానికి శ్రీకారం

-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి సాధించిందని ఇందులో భాగంగా నిత్యం రద్దిగా ఉండే రహదారులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టిందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తెలియజేశారు. శనివారం ఉదయం “మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ” కార్యక్రమం కంబాల చెరువు దగ్గర దండీ మార్చ్ వద్ద నుండి శాసన సభ్యులు ఆదిరెడ్డి వారు స్థానికనాయకులు, అధికారులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు …

Read More »

“శాశ్వత లోక్ అదాలత్ ప్రజా  ప్రయోజన సేవలు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “శాశ్వత లోక్ అదాలత్ ప్రజా  ప్రయోజన సేవలు” (PLAPUS) పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PLAPUS చైర్మన్ శ్రీమతి ఏ. గాయత్రి దేవి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య, వైద్య, తపాలా, టెలీ ఫోన్, …

Read More »