మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భావితరాల భవిష్యత్తుకు నాంది యువ కెరటాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈ డబ్ల్యూ ఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖా మంత్రి శ్రీమతి ఎస్ సవిత అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం నుండి నిర్వహిస్తున్న యువ కెరటాలు రెండు రోజుల కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనాటి బాలలే రేపటి పౌరులు, యువతలో దాగి ఉన్న స్కిల్స్ వెలికి తీయడానికి యువ కెరటాలు దోహదం చేస్తుంది, గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుంటామన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్స్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేస్తుండగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, మెగా పేరెంట్స్ డే నిర్వహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం, రేపటినుండి జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక క్రీడల వంటి కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంతో వారిలో స్కిల్స్ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని కృషి చేస్తున్నది అన్నారు విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్తు బాగుంటుందన్నారు. మచిలీపట్నంలో ఉన్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆకాంక్ష నెరవేర్చాలని సూచించారు. గంజాయి వంటి జీవితాలను సర్వనాశనం చేస్తాయని, ఈ అంశంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ 2009 సంవత్సరంలో 500 మందితో ప్రారంభించిన యువ కెరటాల కార్యక్రమానికి నేడు 13,000 మంది విద్యార్థులు విచ్చేసారని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను, సమర్ధతను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని విద్యార్థులకు ఆశీస్సులు తెలిపారు.
కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ మాట్లాడుతూ మంత్రి గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నారు. పాఠశాలల పిల్లలు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు కెరీర్ పరంగా ఏ కోర్సు చదవాలి గైడ్ చేస్తామన్నారు.
స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ మాట్లాడుతూ యువత చదువుతోపాటు ఆటవిడుపుగా extra curricular activities లో పాల్గొనాలని, కష్టపడితే ఏదైనా సాధ్యం అన్నారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ శ్రీనివాస్ విచ్చేసి మంచి గజల్స్ ఆలపించారు. యువ కెరటాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, యువతకు దశ దిశ నిర్దేశం చేసి, వారిలో స్ఫూర్తినింపాలని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.
తొలుత నాట్యచార్యులు డాక్టర్ చింత రవి బాలకృష్ణ టీం కూచిపూడి బృంద నృత్యం, నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థులు యోగాతో వందేమాతరం నృత్య ప్రదర్శన అలరించాయి.
తొలుత నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించారు.
అనంతరం పాఠశాలల విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాయి.
వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. జిల్లా మత్స్యశాఖ వివిధ రకాల చేపలతో ఎక్వేరియం, సమగ్ర శిక్ష, విద్యాశాఖ, ఐసిడిఎస్, మెప్మా జలవనరుల శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. స్థానిక డి ఎం ఎస్ ఎస్ విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల టెక్నికల్ షో, జన విజ్ఞాన వేదిక సైన్స్ షో ఏర్పాటు చేశాయి.
మెప్మా పిడి పి సాయిబాబు, డిఇఓ పీవీ రామారావు, ఎంఈఓ దుర్గాప్రసాద్ కార్యక్రమాల సమన్వయం,
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, లంకె నారాయణ ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, మాదివాడ రాము, బత్తిన దాసు, కొల్లు ఫౌండేషన్ ప్రతినిధులు కొల్లు పునీత్ చంద్ర, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు