చిన్నారులకు ప్రీ స్కూల్ లో ఆటపాటలు నేర్పి ప్రాథమిక పాఠశాల కు పంపేవారకు అంగన్వాడీ వ్యవస్థ కీలక భూమిక వహిస్తుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తనపరిధిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ తలలో నాలుకలా ప్రతి ఇంటి పెద్దలా వ్యవహరించేది ఒక్క అంగన్వాడీ కార్యకర్త మాత్రమే నని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం కైకలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఆధ్వర్యంలో జరిగిన వర్క్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎన్ఆర్ మాట్లాడుతూ స్త్రీ వివాహంమొదలుకొని బిడ్డలు పుట్టి..వారిని ప్రీ స్కూల్ లో ఆటపాటలు నేర్పి ప్రాథమిక పాఠశాల కు పంపేవారకు అంగన్వాడీ వ్యవస్థ కీలక భూమిక వహిస్తుందని అన్నారు. తన పరిధిలోని గర్భవతులకు, ప్రసూతి మహిళలకు చిన్నారి బాలబాలికలకు మానవతా విలువలతో కూడిన సేవలు అందించే నేస్తం అంగన్వాడీ కార్యకర్త అన్నారు.ఒక ఆడబిడ్డ తనలాంటి ఎందరో ఆడబిడ్డలకు సాయపడే సంస్కారవంతమైన ఉద్యోగం చేస్తున్న మీరు అదృష్టవంతులని అన్నారు.మంచి మనసున్న మారాజు జగనన్న తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ,బాలామృతం వంటి మంచి పథకాలతో పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు.మీ ప్రాంతాల్లో తల్లులకు చదువు యొక్క ఆవశ్యకతను తెలిపి వారి బిడ్డలకు విద్యావంతుల్ని చేసేవిధంగా మంచి సలహాలతో ముందుకు నడపాలని మీ అందర్నీ కోరుతున్నానన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సీడీపీవో ప్రసన్న విశ్వనాథ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు నూటికి నూరుశాతం అమలు చేసి మంచిపేరు తెచ్చుకుంటామని ప్రాజెక్టు తరపున హామీ ఇస్తున్నామన్నారు.తాహశీల్దార్ సాయి కృష్ణ కుమారి,ఎంపీడీఓ వెంకటరత్నం,ఎంపిపి అభ్యర్థి అడివి కృష్ణ,మైనారిటీ నాయకులు మహమ్మద్ జహీర్,అబ్దుల్ హమీద్,వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ బి.వి.ఆర్ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు పుస్తకాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో దండే రవిప్రకాష్, నిమ్మల సాయిబాబు, బోడిచర్ల సురేష్, తోట మహేష్, మూడెడ్ల గౌరీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *