Breaking News

నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పట్టణంలో రూ. 90.41 లక్షల వ్యయంతో 11 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్
-రూ.82.11 లక్షల మున్సిపల్ సాధారణ నిధులు, రూ.8.30 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతుల కల్పించామని వెల్లడి
-రూ.77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, రూ.4 లక్షల విలువైన ప్రహారీగోడ, రూ.6.35 లక్షల విలువైన అంగన్ వాడీ కేంద్రం అభివృద్ధికి ప్రారంభోత్సవాలు చేశామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తున్నామన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం నిడదవోలు పట్టణంలో రూ. 90.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 11 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఘనంగా ప్రారంభించారు.అందులో భాగంగా రూ.77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, రూ.4 లక్షల విలువైన ప్రహారీగోడ, రూ.6.35 లక్షల విలువైన అంగన్ వాడీ కేంద్రం అభివృద్ధికి మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల కోసం మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ. 82.11 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ. 8.30 లక్షలను వెచ్చించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. పట్టణంలో రోడ్డు కనెక్టివిటీ, డ్రైనేజీ సౌకర్యాలు, నీటి సరఫరా, ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,నిడదవోలు మునిసిపాలిటీ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు పట్టణంలో పలు కాలనీలో పర్యటించగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చిన్నారులతో మంత్రి దుర్గేష్ ఉత్సాహంగా గడిపారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తన పర్యటన కొనసాగించారు. పలు సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అందులో భాగంగా తొలుత నిడదవోలు పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డు మహబూబ్ జానీ వీధి నందు రూ.26.56 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైను పనులను, నోబల్ కాన్వెంట్ వీధి, పాత పంగిడి రోడ్డు నందు డ్రైన్లు మరియు 7వ వార్డు వెలగంటి వారి వీధి నందు డ్రైన్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు రూ.21.80 లక్షల అంచనా వ్యయంతో చిన్న మసీదు డోర్ నెంబర్ 7-4-1 నుండి 7-4-14 వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణాలను ప్రారంభించారు.రతీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న 6వ వార్డులోనే రూ.62.71 లక్షల విలువైన 6 పనులు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. అదే విధంగా 13,16 వార్డుల్లో రూ.12.95 లక్షలతో గాంధీ నగర్ నుండి చేపట్టిన అప్రోచ్ రోడ్డు నిర్మాణం, 23వ వార్డులో దాదాపు 15 లక్షల విలువైన లింగంపల్లి బరియల్ గ్రౌండ్ వద్ద మినీ వాటర్ ట్యాంక్, అంగన్ వాడీకి ప్రహారీ గోడ, లింగంపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సీసీ డ్రైన్ పునర్నిర్మాణం, అదే విధంగా దున్న వెంకటరావు ఇళ్లు వద్ద సీసీ డ్రైన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి:మంత్రి దుర్గేష్

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. నిడదవోలులో రోడ్డు కనెక్టివిటీ, మెరుగైన డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం” అని పేర్కొన్నారు.నిడదవోలు పట్టణాన్ని ప్రణాళికా ప్రకారం అభివృద్ధి చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి గ్రామ దేవత నంగాలమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి చేపడుతామని స్పష్టం చేశారు.స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టణంలో జరిగిన అభివృద్ధిని పరిగణించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.ఎమ్మెల్యే అవుదామని వచ్చిన తనను మంత్రిని చేసిన నియోజకవర్గం నిడదవోలు అని తాను ఇక్కడి ప్రజలకు ప్రజాసేవకుడిగా పనిచేస్తానన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పురపాలక సంఘ వైస్ ఛైర్మన్ పదవి ముస్లింలకు కేటాయించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను నిర్మించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శ్రద్ధ వహించి దాని నిర్మాణానికి చర్యలు తీసుకుందని త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, ఓసీలకు కూటమి ప్రభుత్వంలో అగ్రతాంబూలం ఇస్తున్నామన్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్న నేపథ్యంలో క్రమబద్ధీకరణపై దృష్టిసారించామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు అందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రజలకు ఇచ్చి తీరుతామన్నారు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గత ప్రభుత్వ విధానాలపై మంత్రి దుర్గేష్ ఫైర్

2019-24 మధ్యకాలంలో గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టలేదని, గుంతలుగా మారిన రోడ్లపై కనీసం తట్టెడు మట్టి వేయలేదని మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు.స్థానికంగా మార్కెట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, రైతు బజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మున్సిపల్, రుడా, ఎస్సీ కాంపోనెంట్ తదితర వాటి నుండి నిధులు సమీకరించి కూటమి నాయకులతో కలిసి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ సహకారంతో నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చామని గుర్తుచేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు వాటిని స్వయంగా తామే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మార్చి 17 న కౌన్సిలర్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కౌన్సిలర్ల పనితీరును మంత్రి దుర్గేష్ అభినందించారు.భవిష్యత్ లో మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన రతీదేవిని మంత్రి దుర్గేష్ అభినందించారు. మరో ఆరు నెలలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, స్థానిక కౌన్సిలర్లు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *