Breaking News

రాజమహేంద్రవరం లో ఉగాది పురస్కార మహోత్సవం – కవులు, కళాకారులకు ఘన సన్మానం

-ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లోక్ సభ నియోజక వర్గంలోని కవులు, పండితులు, కళాకారులను సముచిత రీతిలో గౌరవించేందుకు “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం” మార్చి 19 వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు లోక్ సభ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉగాది పురస్కార మహోత్సవం తేది 19.03.2026, గురువారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నగరంలోని జె.కె. గార్డెన్స్, జవహర్లాల్ నెహ్రూ నగర్ రోడ్ (జె.ఎన్.రోడ్) వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన కవులు, పండితులు, కళాకారులను సన్మానించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక రంగ అభివృద్ధికి ఈ పురస్కారాలు ప్రోత్సాహకరంగా నిలుస్తాయని దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. అందువల్ల సంబంధిత వర్గాల వారు, సాహితీ, సాంస్కృతికాభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *