Breaking News

ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న మంత్రి మండిపల్లి రామప్రసాద్

-చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII & IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌ లో పోల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్.
-ఇండియా గేమింగ్ షో రిబ్బన్ కటింగ్ చేసిన ప్రారంభించిన మంత్రి.
-ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి
-ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్‌గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త :
చెన్నై ట్రేడ్ సెంటర్‌లో CII, IDGS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గేమింగ్, ఈ-స్పోర్ట్స్ పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ఆధునిక సాంకేతికతలు, కొత్త ట్రెండ్స్‌పై ఆసక్తి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో దేశ విదేశాల ప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రసంగిస్తూ, గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నదని, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో IDGS అధ్యక్షులు రాజన్ నవానీ, వైస్ ప్రెసిడెంట్ సీన్ సోన్ ను మంత్రి అభినందించారు. అలాగే IDGS సెక్రటేరియట్ సభ్యులు సుభాష్ సర్పు, మధురిమ మణియర సపాల్గొన్నారు . గేమింగ్ రంగ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు మరింత దోహదం చేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *