Breaking News

భారత ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’

-డీలిమిటేషన్ బిల్లులు వ్యతిరేకించడమంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకోవడమే
-భాజపా జాతీయ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడమంటే దేశ భవిష్యత్తును అడ్డుకోవడమేనని భాజపా జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య 4 ఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ‘ప్రజాస్వామ్యంలో ఇదోక (శుక్రవారం) చీకటి రోజు. అధికారంలో ఉన్నప్పుడు బిల్లును కాంగ్రెస్ ముంద కు సాగనివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది ఇదీ కాంగ్రెస్ అండ్ కంపెనీ మార్క్ మహిళా బిల్లును వ్యతిరేకించడం అంటే అక్కా చెల్లెళ్లకు అధికారం దక్కకుండా అడ్డుకోవడమే వారి హక్కులు హరించడమే విపక్షాన్ని మహిళా లోకం, దేశ ప్రజలు క్షమించరు. రాజకీయాల్లోనికి సాధార ణ కుటుంబాల నుంచి వచ్చే మహిళలకు అవకాశాలు రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంది.

అలాగే డీలిమిటేషన్ను వ్యతిరేకించడమంటే. ఎస్సీ, ఎస్టీల రాజకీయ అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుంది లండన్లో లక్ష, ఫ్రాన్స్లో 11 లక్షలు, జర్మనీలో 11, కెనడాలో 12, ఆస్ట్రేలియాలో 1.7 లక్షలు, జపాన్లో 27, యూఎస్లో 77 లక్షలకు ఒకరు చొప్పున లోక్ సభ సభ్యుడు ఉన్నారు. మనదేశంలో గరిష్ ౦గా 27 లక్షలకు ఒక లోక్ సభ సభ్యుడు ఉన్నారు. డీలిమిటేషను 2023 లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాలు కూడా తగ్గుతాయి. 2026 లో డిలీమిటేషన్ చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోగా విపక్షాలు అడ్డుకోవడం అవివేకం. దార ణం” అని మంత్రి శ్రీ సత్యకుమార్ గురువారం రాత్రి జారీచేసిన ప్రకటనలో దుయ్యబట్టారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *