Breaking News

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. శ్రీనివాస్ కు ఘన వీడ్కోలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయమూర్తి వి.జస్టిస్ శ్రీనివాస్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ వి. శ్రీనివాస్ నిబద్ధత కలిగిన న్యాయమూర్తని కొనియాడారు. జస్టిస్ వి. శ్రీనివాస్ కృష్ణాజిల్లా తిరువూరులో లక్ష్మణరావు, సుశీలాకుమారి దంపతులకు ఏప్రిల్ 18, 1964లో జన్మించారని,1988వ సంవత్సరంలో నూజివీడు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు. ఆగస్టు 4, 2022న హై కోర్టు న్యాయమూర్తిగా నియమకం అయ్యారని తెలిపారు.జస్టిస్ వి. శ్రీనివాస్ తన పదవీ కాలంలో అనేక కీలకమైన తీర్పులను వెలువరించారని, న్యాయ వ్యవస్థకు విశేష సేవలు అందించారని కొనియాడారు. జస్టిస్ వి. శ్రీనివాస్ జిల్లా మరియు సెషన్స్ జడ్జీగా, రిజిస్ట్రార్ గా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు.పదవీ విరమణ అనంతరం జస్టిస్ వి. శ్రీనివాస్ శేష జీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నానని ప్రధాన న్యాయమర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు.

అనంతరం అడిషినల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభునాథ్ వాసిరెడ్డి లు జస్టిస్ వి.శ్రీనివాస్ కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ వి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తన విద్యార్థి దశ నుండి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు,అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ, న్యాయవాదులు జస్టిస్ వి. శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం -సౌండ్ ప్రూప్ రూములు కూడా.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *