Breaking News

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఈ నెల ‘జలధార-జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు

నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరుతారు. 11.00 గంటలకు నిడదవోలు చేరుకుంటారు. 11.20 గంటలకు సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.50 గంటలకు మలకోడు సరస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపునులతో ఇంట్రాక్ట్ అవుతారు. 02.30 గంటలకు ఎస్టీ అంబ్రోస్ స్కూలు సమీపంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు అమరావతికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం -సౌండ్ ప్రూప్ రూములు కూడా.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *