Breaking News

ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 24 మరియు 25 తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో పర్యటించనున్నారు.

ఆదివారం (24.05.2026) సాయంత్రం 4 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి దుబచర్ల – ఐ.ఎస్. జగన్నాధపురం – ఎర్రంపేట – నల్లజర్ల మార్గంలో రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం చేరుకుంటారు.

రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన వసతి గృహం చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

సోమవారం (25.5.2026) ఉదయం 6 గంటలకు హోటల్ షెల్టన్ నుండి బయలుదేరి పుష్కర్ ఘాట్‌కు చేరుకుని అక్కడ పుష్కరాల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం పడవ ద్వారా కోటిలింగాల ఘాట్ వరకు ప్రయాణిస్తూ నల్లా ఛానల్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.

ఉదయం 6.50 గంటలకు కోటిలింగాల ఘాట్ చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నడకన నల్ల కాలువ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వ్యర్థాల శుద్ధి, వ్యర్థాల వేరు చేసే ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

తదుపరి ఉదయం 7.50 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 9 గంటలకు హోటల్ షెల్టన్‌కు చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *