రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రివ్యూ తర్వాత ఓ కదలిక వచ్చిందని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. ఏపీ పేపర్ మిల్లు కాలుష్యం, రాజమండ్రి నగర, రూరల్ కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకరంగా తయారైందని గోరంట్ల చెప్పారు. రాజమండ్రి మురుగు నీరును శుద్ధిచేసి గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగున లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని అన్నారు. ఇందుకోసం 440 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కొన్ని ఎస్టిపి ప్లాంట్లు నిర్మాణం చేయాల్సి ఉందని మురుగునీరును శుద్ధి చేసి మ్యారేజి దిగువ వదిలితేనే కాలుష్యం నుంచి మోక్షం ఉంటుందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత కాలుష్యం నియంత్రణకై ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు.. గోదావరి లో రాజమండ్రి మురుగునీరును కలవకుండా చూస్తేనే జలజీవన్ మిషన్లో రక్షిత మంచినీటిని ప్రజలకు అందించవచ్చునన్నారు.. జలజీవన్ మిషన్ లో చేపట్టే పథకానికి ఇచ్చిన ఇరిగేషన్ స్థలంపై కొందరు సొసైటీ పేరుతో కోర్టుకెళ్లారని దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు.
కడియం పేపర్ మిల్ లాకౌట్ ఎత్తివేత పై
తూర్పుగోదావరి జిల్లా కడియం బ్రాంచ్ ఏపీ పేపర్ మిల్లులో కొనసాగుతున్న లాకౌట్ ను కొంతమందిని తొలగించి ఎత్తివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంపై మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీరియస్ అయ్యారు. గత నెల 27వ తేదీ నుంచి కడియం ఏపీ పేపర్ మిల్లులో కార్మికుల సమ్మెతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. అయితే కార్మిక సంఘాలకు యాజమాన్యానికి అనేక చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాలేదు . అయినప్పటికీ తాజాగా 59 కాంట్రాక్ట్ కార్మికులను, వారికి మద్దతు తెలిపినందుకు 11 మంది రెగ్యులర్ కార్మికులను తొలగిస్తూ లాకౌట్ ను ఎత్తివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన వారిని కూడా విధుల్లోకి తీసుకుని లాకౌట్ని ఎత్తివేస్తేనే అంగీకరిస్తామని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు.. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులకు సంబంధించిన వేతనాలు పెంచకపోవటం వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని, యాజమాన్యం వైఖరిని తీవ్రంగా ఖండించారు
Prajavartha Online Telugu News