Breaking News

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 గైడ్ లైన్స్ తప్పక పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (యన్.జి.టి) నిబంధనల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 గైడ్ లైన్స్ ను నగర నగరాల్లో మరియు పురపాలక సంస్థల్లో తప్పక పాటించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అన్నారు. బుధవారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (యన్.జి.టి) గుంటూరు జిల్లా కమిటీ రెండవ త్రైమాసిక సమావేశం కమిషనర్ అధ్యక్షతన జరిగింది.
సదరు సమావేశం నందు కమిషనర్ మాట్లాడుతూ, సాలిడ్ పేస్ట్ మేనేజ్‌మెంట్ 2026 గైడ్ లైన్స్ ప్రకారం ఘన మరియు ద్రవ వ్యర్ధాల నిర్వహణ అన్ని పట్టణ స్థానిక సంస్థలు పక్కాగా నిర్వహించాలని తెలియజేశారు. ఘన వ్యర్థాలను మూలం వద్దే తడి–పొడి వ్యర్ధాలుగా వేరు చేసి సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ ప్లాంట్లలో శుద్ధి చేయడం చాలా ముఖ్యమని అన్నారు. ద్రవ వ్యర్థాలను కూడా సమర్థవంతంగా శుద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీల అవసరాలకు అనుగుణంగా ఎస్‌టీపీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లెగసీ వ్యర్థాల నిర్మూలన పూర్తైనందున, మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా లెగసీ వ్యర్థాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో తెనాలి మునిసిపాలిటి కమిషనర్ జే. రామ అప్పలనాయుడు, మంగళగిరి మునిసిపాలిటి కమిషనర్ అలీం బాషా, పొన్నూరు మునిసిపాలిటీ కమిషనర్ యం. రమేష్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ సురేష్, నాగార్జున యునివర్సిటీ ఎన్విరాన్మెంట్ సైన్సు డిపార్ట్ మెంట్ హెడ్ భ్రమాజి, జియంసి సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, (ఇంచార్జి) ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *