Breaking News

నిడదవోలులో విశాఖ – ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ మంజూరు

-కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం–ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) ఎక్స్‌ప్రెస్‌ (18519/18520)కు హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ హాల్ట్‌తో గోదావరి జిల్లాల ప్రజలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో మరింత మెరుగైన రైల్వే అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ, రైల్వే సేవలను మరింత విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయమని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *