Breaking News

దివ్యాంగుల సాధికారతపై జాతీయ అవార్డులకు నామినేషన్లు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల సాధికారత(Empowerment of Persons with Disabilities- 2026)జాతీయ అవార్డులకు అర్హులైన వ్యక్తులు,సంస్థల నుండి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం తెలియజేసిందని రాష్ట్ర దివ్యాంగులు,ట్రాన్సు జెండర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ సంచాలకులు యం.వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.దివ్యాంగుల సాధికారతకు వినూత్న రీతిలో విశేష కృషి చేసి వారి జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు పాటుపడిన వారిని గుర్తించి గౌరవించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డులను ఇవ్వనుందని తెలిపారు.
దివ్యాంగుల సాధికారతకు సంబంధించి నేషనల్ అవార్డు ఫర్ ఇండివిడ్యువల్ ఎక్సెలెన్స్ 2026,నేషనల్ అవార్డ్సు ఫర్ ఇనిస్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎంపవరింగ్ పెర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2026 పేరిట ఈజాతీయ అవార్డులను ప్రదానం చేయనుందని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.
ఈఅవార్డులకు సంబంధించిన పూర్తి ఎలిజిబులిటీ క్రైటీరియు మరియు నామనేషన్ల పంపే విధానం తదితర వివరాలు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ లో జాతీయ అవార్డు మార్గదర్శకాల్లో పొందుపర్చబడి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఈఅవార్డులకు సంబంధించిన ధరఖాస్తులు,నామినేషన్లను ఈనెల 31వ తేదీలోగా www.awards.gov.in లో ఆన్లైన్ విధానంలో సమర్పించేందుకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.
కావున రాష్ట్రంలోని అందరు జిల్లా కలక్టర్లు,వివిధ శాఖల విభాగాధిపతులు ఈసమాచారాన్ని క్షేత్రస్థాయి వరకు చేరవేసి అర్హులైన వ్యక్తులు,సంస్ధల నుండి ధరఖాస్తులు, నామినేషన్లు సకాలంలో చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *