Breaking News

వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి…

-ఎం ఎల్ ఏ సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 79 జయంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గం , విద్యాధరపురం వీ ఎం రంగా జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. మోహనరంగా విగ్రహ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మైలవరపు దుర్గారావు మైలవరపు కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ( సుజనా చౌదరి) పాల్గొని మోహన్ రంగా విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు రంగా అని కొనియాడారు. మోహనరంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సుజన పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో ఏపీ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ పంచకర్ల సందీప్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె.నాగుల్ మీరా, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు తదితరులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత గునుకుల పుల్లయ్య, మిరియాల వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మహదేవు అప్పాజీరావు, మరుపిళ్ల రాజేష్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), గుడివాడ నరేంద్ర రాఘవ, పత్తి నాగేశ్వరావు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, లింగం శివప్రసాద్, కె.యస్.ఎన్, మూర్తి,అక్కల గాంధీ, ఏలూరు శరత్, పేటేటి నాంచారయ్య, బావిశెట్టి, శ్రీనివాస్,బొమ్ము గోవిందమ్మ సంభన బాబురావు, గంధం అంజిబాబు గన్ను శంకర్,తమ్మిన లీలాకుమార్,తో పాటు పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *