విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి అభివృద్ధికి మరియు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎం ఎల్ ఏ సుజన చౌదరి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఎంఎల్ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మంగళవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ పీ సారమ్మ మరియు వైద్యులతో మాట్లాడి ఆస్పత్రి అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంఎల్ఏ సుజన చౌదరి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా షేక్ రాజా సాహెబ్ ఆస్పత్రిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టారన్నారు. పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా, మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఎం ఎల్ ఏ సుజన చౌదరి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి నందు అవుట్ పేషెంట్స్ కొరకు బాత్రూంల నిర్మాణం, బయో మెడికల్ వ్యర్ధాలను నిల్వ ఉంచుటకు స్టోర్ రూమ్, రోగుల దాహార్తిని తీర్చడానికి ఆర్వో ప్లాంట్ నిర్మాణం, ఆస్పత్రికి కావాల్సిన ఫర్నిచర్ తదితర అంశాలపై చర్చించారు. డాక్టర్ స్రవంతి, డాక్టర్ సాయిరాం,, డాక్టర్ మోహన్ శివ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News