-తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం లో నివాస ప్రాంతాలకు అనుసంధాన రోడ్డు మంజూరు
-1.815 కోట్ల అంచనా వ్యయంతో 1.71 కిలోమీటర్ల రోడ్డు పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.
-ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన -4 సంవత్సరం 2026-27 బ్యాచ్ -1 కింద ప్రారంభం కానున్న పనులు
-విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ గా మారిన కేశినేని చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా (ఏ కొండూరు మండలం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలానికి ఎంపీ కేశినేని చిన్ని చొరవతో మరో లబ్ధి చేకూరనుంది.ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలకు అంబాసిడర్ గా మారిన కేశినేని చిన్ని తాజాగా మరో అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పాటు అందించారు తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలో నివాస ప్రాంతాలకు అనుసంధానం చేసే రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా ముందుగా తన విజ్ఞప్తి మేరకు ఏ కొండూరు మండలం లో రోడ్డు పనికి ఆమోదం తెలిపిన కేంద్రానికి ఎంపీ చిన్ని కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఆమోదం పొందిన లేఖను విడుదల చేశారు ప్రధానంగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన-4, బ్యాచ్-1 2026 -27 కింద1.815 కోట్ల అంచనా వేంతో1.71 కిలోమీటర్ల రోడ్డు పనిని కేంద్రం ఆమోదించింది ముఖ్యంగా రహదారులు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర ఈ రహదారులు పోషిస్తాయని లేఖలో పేర్కొంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో ఎంతోమంది బాధితులు ఏ కొండూరు మండలంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి మంచి త్రాగునీరు అందించడంతోపాటు తాజాగా కనెక్టివిటీ రోడ్లను కూడా ఎంపీ కేశినేని చిన్ని ఏ కొండూరు మండలానికి అందించారు. ఎంతో కాలం నుండి సరైన కనెక్టివిటీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ఏ కొండూరు మండలానికి ఎంపీ చిన్ని కనెక్టివిటీ రోడ్ను తీసుకువచ్చి అక్కడి ప్రజలకు బాసటగా నిలిచారు.
అడిగిన వెంటనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలానికి రోడ్డు పనిని మంజూరు చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎంపీ చిన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు
Prajavartha Online Telugu News