ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషకరం

-విద్యాశాఖ మంత్రి కి కృతజ్ఞతలు. కనీస అర్హత మార్కులు, సిలబస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి -ఎస్.టి.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం పట్ల ఎస్.టి.యు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో ఉపాధ్యాయులకు కనీస ఉత్తీర్ణత అర్హత మార్కుల తగ్గింపు, బోధించే సబ్జెక్టు వరకే టెట్ సిలబస్ పరిమితం చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటే వేలాది మంది ఉపాధ్యాయులలో ఉన్న ఆందోళనను తొలగించిన వారవుతారన్నారు. కనుక విద్యామంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *