-విజయవంతమైన రెండురోజుల “ఆర్టీసీ పరిరక్షణ దినముల కార్యక్రమాలు”
-రేపటి నుండి ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరే కార్యక్రమాలు యధావిధిగా చేపడుతున్నాం.. జేఏసీ
-బుదవావారం ఆర్టీసి విసి&యం.డీ ఆదేశాలతో జేఏసి నాయకులతో ఆర్టీసి ఇ.డి లు జరిపిన చర్చలు విఫలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపియస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జూలై 7, 8 తేదీలలో నిర్వహించిన “ఆర్టీసీ పరిరక్షణ దినం” కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరిగాయని ఆర్టీసి జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఈ రెండు రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, భారీ సంఖ్యలో డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆర్టీసీ పరిరక్షణకు, తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారని వారు పేర్కొన్నారు.
అలాగే జేఏసీ నిర్ణయం మేరకు జూలై 9 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలిసి ఉద్యమానికి మద్దతు కోరే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలులను కలిసి, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం, విలువైన ఆర్టీసీ స్థలాలను పెద్ద వ్యాపార సంస్థలకు కట్టబెట్టడం, దశలవారీగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే విదంగా తీసుకుంటున్న చర్యలు మానుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రజారవాణా ఆర్టీసి ని ప్రవేటుపరం కాకుండా చూడాలని కోరతామని కన్వీనర్లు తెలిపారు.
బుదవారం జేఏసి నేతలతో ఆర్టీసి ఇడి లు రెండుదపాలు గా జరిగిన చర్చలు విఫలం
బుదవారం ఆర్టీసి హౌస్ లో ఆర్టీసి విసి& యం.డీ ఆదేశాలమేరకు ఆర్టీసి జెఏసి నాయకులతో రెండు దపాలుగా జరిపిన చర్చల్లో ప్రదానంగా చర్చకు వచ్చిన అంశాల్లో విధ్యుత్ బస్సుఆపరేటర్లకోసం మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2 మరియు మంగళం డిపోలను తక్షణమే పునఃప్రారంభించాలని, భవిష్యత్తులో వచ్చే అన్ని విద్యుత్ బస్సులను పూర్తిగా సంస్థపరంగా కొని ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఏ ఒక్క డిపోను ఖాళీ చేయకూడదు.
అలాగే ప్రస్తుతం ఉన్న బస్సులు లేదా సిబ్బందిని బదిలీలకు చేయకుండా ఉండాలని అలాగే బవిష్యత్ లో టెండర్లు పిలవబోతుతున్న 1450 విద్యుత్ బస్సుల టెండర్లు రద్ధు చేస్తున్నట్లు స్పష్టమైన వ్రాతపూర్వక హామి ఇవ్వాలని ఈచర్చల్లో జేఏసి నాయకులు పట్టుబట్టగా దీనిపై ఇడీ లు దేనిపైకూడా స్పష్టమైన హామి ఇవ్వలేకపోవడంతో రెండుసార్లు జరిగినాచర్చలు విఫలం అయినట్లు కన్వీనర్లు శ్రీనివాసరావు,దామోదరరావు తెలిపారు.
ఇకపైన అయినా సరే ఆర్టీసి జేఏసి నాయకులతో జరిపే చర్చలు గతనెల 11 న డిమాండ్లను పరిష్కరించేదిశగా ఉంటేనే చర్చలు పెట్టాలని లేదంటే ఇలాంటి మొక్కుబడి చర్చలతో సమస్యలు పరిష్కారం కావుఅని అభిప్రాయపడుతు తమసమస్యలు పరిష్కారం జాప్యం చేస్తే ఉద్యమాన్ని దశలవారిగా ఉదృతం చేస్తామని తెలిపారు.
ఈ చర్చలలో ఆర్టీసి ఇ.డిలు కె.యస్.బ్రహ్మానందరెడ్డి, జి.వి.రవివర్మ, గద్దేనాగేశ్వరరావు, పైనాన్సు అడ్వజైర్ & ఛీఫ్ అకౌంట్సు ఆఫీసర్ యన్.సుదాకర్ రావు లతో పాటు ఇతర ఉన్నతాధికార్లు పాల్గోన్నారు. జేఏసి తరుపున కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, యస్.కె.జిలాని, సి.హెచ్. సుందరయ్య యన్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకాష్ రావు, డి.మాల్యాద్రి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News