విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ప్రాంతీయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
“దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం (SCZBG63)”* పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక టూర్ జూలై 20 నుంచి జూలై 28, 2026 వరకు మొత్తం 9 రోజులు, 8 రాత్రులు కొనసాగుతుంది.
ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది.
ఈ యాత్రలో తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరంలోని నటరాజ ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ మరియు కుమారి అమ్మవారి ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించారు.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, శాకాహార టిఫిన్, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి , ప్రయాణ బీమా, టూర్ మేనేజర్ సేవలు, భద్రతా సిబ్బంది, టిఫిన్, భోజనం, ప్రయాణ బీమా, హోటల్ వసతి తదితర సౌకర్యాలు కల్పించబడతాయి.
టికెట్ ధరలు:
స్లీపర్ క్లాస్: ₹15,600 (పెద్దలు), ₹14,600 (5–11 సంవత్సరాల పిల్లలు)
3AC: ₹23,100 (పెద్దలు), ₹21,900 (5–11 సంవత్సరాల పిల్లలు)
టికెట్ల బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఐఆర్సీటీసీ కార్యాలయాన్ని లేదా ఈ నంబర్లను సంప్రదించవచ్చు: 9281030714
అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం [www.irctctourism.com] వెబ్సైట్ను సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News