-ఖేలో ఇండియా కి సంబంధించిన రూ.1000 కోట్ల ప్రతిపాదనలు మంజూరు చేయాలని వినతి
-రాయచోటిలో ఆధునిక Football turf నిర్మాణానికి కృషి, రూ.42.62 కోట్ల కేంద్ర నిధులు కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-కేంద్ర సహకారంతో అన్నమయ్య జిల్లాలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినఖేలో ఇండియా ద్వారా రూ.1000 కోట్ల రూపాయల నిర్మాణ పనుల ప్రతిపాదిత స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్‌బాల్ మైదానం, స్విమ్మింగ్ పూల్తో పాటు ఇతర ఆధునిక క్రీడా సదుపాయాలు ఏర్పాటు. ఈ ప్రాజెక్టు లు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడటంతో పాటు గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు.
అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఆధునిక ఫుట్‌బాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు మంత్రి లేఖ రాశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, నిర్మాణాలకి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News