పామర్రులో జూలై 10న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు శుక్రవారం జూలై 10వ తేదీన పామర్రులో నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జూలై 17వ తేదీన అదే వేదికలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పామర్రు నియోజకవర్గ ప్రజలు ఈ మార్పును గమనించి, తమ వినతులు, సమస్యలతో జూలై 17న నిర్వహించే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరై వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *