మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం అమలుపై భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లాలో సర్ కార్యక్రమం పురోగతిని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ సుమారు 20 వేల నుంచి 25 వేల ఫారాల చొప్పున డిజిటైజేషన్ జరుగుతోందని, ఇదే వేగంతో కొనసాగితే రానున్న మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయగలమని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ మేరకు జిల్లాలో సర్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ తో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News