విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడిలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం–2026 ఆహ్వాన పత్రికను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశకు కలెక్టర్ కార్యాలయంలో గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం అధ్యక్షులు దయానిధి దాస్, కార్యదర్శి దశావతార దాస్ జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రథయాత్ర మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై 18,2026న మధ్యాహ్నం 2 గంటలకు గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుంచి శ్రీ కృష్ణ బలరామ గోశాల, గోమాత ల్యాండ్, కరకట్ట రోడ్, గొల్లపూడి వరకు వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News