ఈ నెల 10న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
మాచవరంలోని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు అర్జీలను ఉదయం 10 గంటల నుంచి స్వీకరించడం జరుగుతుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటార‌ని ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *