72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి భారీ విగ్రహం ఏర్పాటుకు ఎంపీ చిన్ని భూమి పూజ

-డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే భారీ వినాయక విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ చిన్ని
-పంచముఖ వరసిద్ధి మహాగణపతి 2026 నమూనాను విడుదల చేసిన ఎంపీ చిన్ని
-ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం భవానిపురం సితార సెంటర్ ప్రాంతంలో డుండి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసే విధంగా భారీ వినాయక విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని సాంప్రదాయపద్ధంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ ప్రతి ఏటా ఎకో ఫ్రెండ్లీ విధానంలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్న డూoడి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేశారు గతంలో భారీ గణేషుడి విగ్రహాన్ని చూడాలంటే హైదరాబాదులోని ఖైరతాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేదని గత ఆరు వార్షికోత్సవాల నుండి డూండి గణేష్ సేవా సమితి వారు అత్యంత వైభవపేతంగా భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎకో ఫ్రెండ్లీ విధానంతో విగ్రహ ఏర్పాటు విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు అన్ని అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని ఈ విధంగా ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రతిష్ట చేసుకొని వినాయక చవితి జరుపుకోవాలని ఎంపీ చిన్ని తెలియజేశారు

ఇలాంటి గొప్ప కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని 72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి భారీ వినాయక విగ్రహ ఏర్పాటు విజయవాడలో చేయడం గొప్ప విషయమని ఎంపీ చిన్ని అన్నారు పర్యావరణహితంగా ప్రతి ఏటా ఇదే విధంగా మహాగణపతి విగ్రహాన్ని డూండి గణేష్ సేవాసమితి వారు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రతి చోట ఇదే విధానం అందరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు గత ఏడాది ముఖ్యమంత్రి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే చాలా క్రమశిక్షణతో ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం జరుగుతుందని ఎంపీ చిన్ని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మరియు డూండి గణేష్ సేవా సమితి సభ్యులు డూండి రాకేష్ గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెస్ బేగ్ మరియు డూండి గణేష్ సేవ సమితి సభ్యులు ముక్తేశ్వర రావు పేర్ల రవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *