విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కాంతారావు ,34 వ డివిజన్, టీడీపీ , బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు , ఆకుల రవి శంకర్, రుద్రపాటి వెంకటేష్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు.
వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకతీతంగా , ప్రజాసేవే ధ్యేయంగా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తెలిపారు. కూటమి నేతలు పిళ్ళ శ్రీనివాసరావు, ప్రదీప్ రాజ్, దుర్బేసుల హుస్సేన్, నందకుమారి, విజయలక్ష్మి, సుభాషిణి, పితాని పద్మ, గాయత్రి, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News