విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్,46వ డివిజన్ కు చెందిన (లేటు)చుక్క వెంకులు, (లేటు)రమణమ్మ దంపతుల కుమారుడు సతీష్ , పావనిల వివాహం లంబాడీ పేట లోని ఓ చర్చి లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి నూతన వధూవరులకు పెళ్ళికానుక పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని వధూవరులకు పెళ్లి కానుకను అందజేశారు. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులు బంధుమిత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News