విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించటానికి ఇప్పటికైనా స్పందించాలని పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు కోరారు. శుక్రవారం ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నా లో పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తక్షణమే జోక్యం చేసుకొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వలన బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించకపోతే మహిళా బిల్లు లక్ష్యం నెరవేరదని మహిళా బిల్లు పేరుతో మళ్లీ అగ్రకులాల పాలనే మొదలవుతుందని తెలిపారు. బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును బీసీలు ఒప్పుకోరన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిప్పాడ చందు, ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెంట సాయికిరణ్, సీనియర్ నాయకులు మహంతి వాసుదేవరావు, బీసీ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News