నగరంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) సంబంధించి నగరంలోని వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటికి అదనంగా ప్రజలు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గుంటూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ల వద్ద ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించిన పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, వారి నుండి వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను ఫారాలను నేరుగా స్వీకరిస్తారని చెప్పారు. అలా సేకరించిన ఫారాలను తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత ఎలక్షన్ సూపర్‌వైజర్లకు అందజేయడం జరుగుతుందన్నారు. గుంటూరు నగర ప్రజలతో పాటు నగరానికి వచ్చే ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలందరూ తమ పరిధిలోని వార్డు కౌంటర్లను కానీ, లేదా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కానీ సంప్రదించి సర్ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *