విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పుష్పాభిమానులకు రకరకాలైన బోకేల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాపీ ప్రారంభించారు. శుక్రవారం బందరురోడ్డులోని బృందావన్ కాలనీలో ఎ కన్వెన్షన్ ఎదురుగా ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాప్‌ను నిర్వాహకులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.శేఖర్, డి.అర్జున్ మాట్లాడుతూ అభిరుచిగల పుష్పాభిమానులు అభినందనలు తెలపడానికి, సెలబ్రటీలను, ప్రముఖులను, వివాహాది శుభకార్యాలకు సంబంధించి తదితర కార్యక్రమా లకు ప్రత్యక్షంగా అందజేసే బోకేలను, ఫ్లవర్ బకెట్స్ వివిధరకాల రంగులు కలిగిన పువ్వులతో అనేక రకాల మోడల్స్‌లో అందజేస్తున్నామన్నారు. అంతే కాకుండా వివాహ శుభకార్యాలకు డెకరేషన్స్, రిటైర్‌మెంట్ ఫంక్షన్స్, ఈవెంట్స్, బెలూన్ డెకరేషన్స్ తదితర డెకరేషన్స్ అందుబాటు ధరలలో కస్టమర్స్‌కు సేవలు అందజేస్తున్నామన్నారు. కస్టమర్స్‌కు మరింత చేరువయ్యేం దుకు ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకుని అందజేస్తామన్నారు. కాబట్టి విని యోగదారులు తమ షాపును ఒక్కసారి వీక్షించి ప్రోత్సహించాలని కోరారు.
Prajavartha Online Telugu News