ఉమ్రా యాత్రను జెండా ఊపి ప్రారంభించిన హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వించిపేట నుంచి మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన 90 మంది ఉమ్రా యాత్రకుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్, ఎం ఎన్ డి ఫరూక్ లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొని ఉమ్రా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.జీవితంలో ఒక సారి ముస్లిం అందరూ పవిత్ర హజ్ యాత్ర చేయడం ముఖ్యమని , ఉమ్రా యాత్ర ఎన్నిసార్లు అయినా వెళ్ళ వచ్చని ,పవిత్ర మక్కా యాత్ర వెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయమని ప్రతి ముస్లిం మక్కాకు మదీనాకు వెళ్లడం అదృష్టంగా భావిస్తారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు తెలియజేశారు . విజయవాడ నుండి వెళ్ళే వారికి రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తుందని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *