వెండి పతక విజేత దాక్షిణ్యను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్రానికి కీర్తి తెచ్చిన స్కేటర్ దాక్షిణ్యకు మంత్రి అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్య అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బిగ్ చాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ భాష మాట్లాడుతూ, దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్‌లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాక్షిణ్య తల్లిదండ్రులు సి.హెచ్. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *