హాస్పిటాలిటీ రంగానికి ‘జీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్’ను పునరుద్ధరించండి

-విజయవాడ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ని కలిసి అభ్యర్థించిన ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్
-హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-జూలై 14న విజయవాడలో “ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్ / ఇన్‌బౌండ్ టూరిజం కాన్‌క్లేవ్”
-టూరిజం కాన్‌క్లేవ్‌కు మంత్రి కందుల దుర్గేష్ పూర్తి సహకారం అందించడంపై ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ మరియు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా.. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం అమలులో ఉన్న 18% జీఎస్టీని 5%కు తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ కు విన్నించింది. కమర్షియల్ ఎల్‌పీజీ వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే అధిక నిర్వహణ వ్యయాన్ని భరిస్తున్నాయని, దీంతో వ్యాపార నిర్వహణలో అసమాన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి హాస్పిటాలిటీ రంగానికి సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యంత అవసరమని, ఐటీసీ తొలగింపుతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ వ్యయం మరియు మూలధన వ్యయం గణనీయంగా పెరిగాయని,సుమారు 20% వరకు పెరిగిన అద్దె భారం కారణంగా ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న హాస్పిటాలిటీ రంగంపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందని వివరించారు.ఈ నేపథ్యంలో ప్రతిపాదనలపై మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అదే విధంగా జూలై 14న టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (TTAA), ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ASHA), ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్ మరియు అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆంధ్ర డొమెస్టిక్ & ఇన్‌బౌండ్ టూరిజం సంయుక్తంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని బెర్మ్ పార్క్ హరిత రిసార్ట్‌లో “ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్ / ఇన్‌బౌండ్ టూరిజం కాన్‌క్లేవ్”కు తమ పూర్తి సహకారం అందిస్తున్నందుకు మంత్రి కందుల దుర్గేష్ కు ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కాన్‌క్లేవ్ ప్రభుత్వం మరియు పర్యాటక రంగం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌బౌండ్ టూరిజం అభివృద్ధికి దోహదపడే ముఖ్య వేదికగా నిలవనుందని అన్నారు.

మంత్రి దుర్గేష్ ను కలిసిన వారిలో ఏపీ ఛాంబర్స్ సలహాదారు లక్ష్మీనారాయణ, అధ్యక్షులు పి. భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి.స్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్. మూర్తి చిట్టూరి, జాయింట్ సెక్రటరీ ఎం.వి. పవన్ కార్తీక్, ఏపీ ఛాంబర్స్ సభ్యులు, టూరిజం కమిటీ మెంబర్ కళ్యాణి కాకాని లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *