-ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని అందులో బాగంగా విజయవాడ డిపో వద్ద జరిగిన ఇ.యు వజ్రోత్సవ వేడుకల్లో పాల్గోన్న ఎంప్లాయీస్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్యలు మాట్లాడుతూ
1952లో స్థాపించబడిన ఎంప్లాయీస్ యూనియన్ గత 74 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, సేవా నియమాల మెరుగుదల కోసం ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు నిర్వహించి విశేష విజయాలు సాధించిందన్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తల త్యాగాలు, అంకితభావం, సభ్యుల ఐక్యతే యూనియన్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చాయని పేర్కొన్నారు.
ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి డిపో, వర్క్‌షాప్, రీజియన్, జోన్, రాష్ట్ర కమిటీలు, గ్యారేజ్ కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యూనియన్ జెండాను ఆవిష్కరించడం, యూనియన్ చరిత్రను స్మరించుకోవడం, సేవలందించిన మాజీ నాయకులను సన్మానించడం, సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.
“75 సంవత్సరాల పోరాటాల స్ఫూర్తితో… ఉద్యోగుల హక్కుల సాధనలో మరింత శక్తివంతంగా ముందుకు సాగుదాం. యూనియన్ ఐక్యతే మన బలం – ఉద్యోగుల సంక్షేమమే మన లక్ష్యం.”అని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
కేంధ్రకార్యాలయం వద్ద జెండా వందనం చేసి కేక్ కట్ చేసారు.
ఈకార్యక్రమంలో రాష్ట్రనాయకులు యం.డి.ప్రసాధ్,యం.డిఏ.సిద్దిక్, యస్,కె.మోహిద్దిన్, యం.శంకరరావు,టి.వి.భవాని ఎన్.ఎచ్. ఎన్ చక్రవర్తి, జి.యస్.నారాయణ, యస్.యస్.నారాయణ, ఎమ్.యస్.లక్ష్మి తో పాటు జోనల్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు,యన్టీఆర్ జిల్లాకార్యదర్శి జి.యం.రావు అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈసందర్బంగా ఇ.యు నాయకులు మాట్యాడుతూ ఏపియస్ ఆర్టీసిలో 1952 జూలై 11 న ఆర్టీసీలో ఆవిర్భావించిన ఎంప్లాయిస్ యూనియన్
-21 రోజులు పనిచేస్తేగాని వీక్లీ ఆఫ్ ఇచ్చే పరిస్థితి నుండి రోజుకు 8 గంటలు పని 7వ రోజు ఒక వీక్లీ ఆఫ్ సాధించిన ఘనత సాదించామని,
-ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన మెడికల్ ఫెసిలిటి తీసుకొని వచ్చాము.
-కార్మికులు వడ్డీ వ్యాపారుల వలన ఇబ్బంది పడకూడదని 1952 లోనే ఇ.యు ని ప్రారంబించిన నాడే CCS సంస్థను ఏర్పాటు చేపించాము.
-ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగి కుటుంబములో ఒకరికి కారుణ్య నియామాకాలు ద్వారా ఉద్యోగాలు ఇచ్చేలా చేసాం.
-ఆర్టీసీలో పనిచేస్తూ 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన ఉద్యోగి కుటుంబములో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాము గతంలో..
-ఆర్టీసీలో 14 సార్లు పే-స్కెల్స్ జరగగా 9 సార్లు చేసిన ఘనత ఎప్పుడు చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానముగా కొన్ని కొన్ని క్యాడర్లలో ప్రభుత్వ ఉద్యోగులకన్నా ఎక్కువ స్కెల్ ఇప్పించాము
-ఆర్టీసిలో ప్రవేశపెట్టిన కాంట్రాక్టు నియామక పద్ధతిని వ్యతిరేకించి 2013 ఇ.యు గుర్తింపులో అప్పటి వరకు ఎలిజిబుల్ ఉన్న దాదాపు 17,000 మంది డ్రైవర్, కండక్టర్ లను దశలవారిగా రెగ్యులర్ చేపించేలా ఒప్పందంచేసి రెగ్యులర్ చేయించిన ఘనత ఇ.యు.
-2013 పే-స్కెల్ 43%, 2017 పే-స్కెల్ 25% 5సంవత్సరాల కాలములోపు మొత్తం 68% జీతాలు మన గుర్తింపులో పెంచిన కారణంగా ఆర్టీసీ ఉద్యోగి ఈ సమాజములో కాలరు రెత్తుకొని జీవించే విధంగా చేశాము.
-2001 లో ఇ.యు గుర్తింపు కాలంలో ఆర్టిసి పరిరక్షణకోసం ఐక్య ఉధ్యమాన్ని నిర్మించి ఆర్టిసి ఆర్దికంగా నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం నుండి కొన్ని రాయితీలు పొందాం..అలాగే మొట్ట మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగుల మాధిగా పిట్ మెంటు విధానాన్ని ప్రవేశపెట్టించామని తెలిపారు.
-ప్రసుత్తం విధ్యుత్ బస్సులు పేరుతో ఆర్టీసిని దశలవారిగా ప్రవేటీకరణ చేయాలన్న ప్రభుత్వనిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్దపడుతున్న జేఏసిలో కూడా బాగస్వామ్యులమై పనిచేస్తుందని తెలిపారు.
– భవిష్యత్ లో సంస్ద పరిరక్షణ,..ఉద్యోగుల హక్కుల సాధనలో ఊద్యోగులంతా భాగస్వాములు అయి ఎటువంటి పోరాటాలకు అయినా సిద్దంగా ఉండాలని ఇ.యు ఆవిర్భావదినోత్సవము ద్వారా శ్రేణులకు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News