రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని షా జహూర్ ముసాఫిర్ ఖానా ఫంక్షన్ హాల్, ఇస్లాంపేటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026 ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మైనారిటీ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలు ప్రముఖ కంపెనీలు తమ ప్రతినిధులతో పాల్గొని అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.
ఈ సందర్భంగా చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి యువకుడు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కంపెనీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు పాల్గొన్న అభ్యర్థులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *