వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి.

-గ్రామీణ ఉపాధికి మరింత భరోసా.. 125 రోజుల పని
-వీబీ-జీ రామ్ -జీ పై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన
-కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్
తిరుపతి జిల్లాలో రూ.175 కోట్లతో 4,627 పనులు చేపట్టాం
-జూలై 1 నుంచి ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభం
-డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సి. మద్దిలేటి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) [VB-G RAM-G] కార్యక్రమంపై తిరుపతి డ్వామా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సు లో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ మాట్లాడుతూ..వీబీ-జీ రామ్ (జీ) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వీబీ-జీ రామ్ (జీ) కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సి. మద్దిలేటి మాట్లాడుతూ… MGNREGS కంటే మెరుగైన విధానాలతో వీబీ-జీ రామ్ (జీ) కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. ఒక కుటుంబానికి ఉపాధి కల్పించే పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు, చేపట్టే పనులను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. వ్యవసాయ పంటల సీజన్‌లో కూలీల కొరత తలెత్తకుండా ఏటా 60 రోజుల పాటు వీబీ-జీ రామ్ (జీ) పనులకు విరామం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ కూలీని రూ.307 నుంచి రూ.312కు పెంచినట్లు వెల్లడించారు.

తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రూ.175 కోట్ల అంచనా వ్యయంతో 4,627 పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరో రూ.113 కోట్ల అంచనా వ్యయంతో 5,066 పనులు మంజూరు దశలో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 2.39 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 3.12 లక్షల మంది క్రియాశీల వేతన ఉపాధి కోరేవారు ఉన్నట్లు పేర్కొన్నారు.వేతనాలను 100 శాతం సకాలంలో చెల్లిస్తున్నామని, ఈ-కేవైసీ ప్రక్రియ 91.99 శాతం పూర్తయిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ కు అధికారులు వివరించారు. జూన్ 2026కు సంబంధించి మూడు వారాల వేతన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు.

వీబీ-జీ రామ్ (జీ) కార్యక్రమం కింద జూలై 1 నుంచి ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. NMMS రోజువారీ హాజరు క్రమంగా పెరుగుతోందని, జూలై 1న 13,709 మంది హాజరు నమోదు కాగా, జూలై 10 నాటికి 46,547 మంది హాజరు నమోదైనట్లు తెలిపారు. జూలై 8న అత్యధికంగా 47,288 మంది హాజరు నమోదైందని పేర్కొన్నారు.అలాగే జూలై 1 నుంచి 6వ తేదీ వరకు తొలి వారంలోనే 94 వేల పని దినాలు కల్పించినట్లు అధికారులు వివరించారు.కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, పని ప్రదేశాల్లో నిర్వహించే వారపు రోజ్‌గార్ దివస్ కార్యక్రమాల ద్వారా కూడా ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో IES, సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి ఆశా వహానే, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, జూనియర్ ఇంజినీర్లు ,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *